Man Drags Cop On Car: నవీ ముంబైలో దారుణం.. ట్రాఫిక్ పోలీసును కారు బానెట్‌పై 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్
తనను ఆపేందుకు ప్రయత్నించిన ఓ ట్రాఫిక్ పోలీసును ఢీకొట్టిన కారు డ్రైవర్ అతడిని ఏకంగా 10 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగిందీ ఘటన.
Mumbai, April 17: తనను ఆపేందుకు ప్రయత్నించిన ఓ ట్రాఫిక్ పోలీసు (Traffic Police)ను ఢీకొట్టిన కారు డ్రైవర్ (Car Driver) అతడిని ఏకంగా 10 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలోని నవీ ముంబైలో (Navi Mumbai) జరిగిందీ ఘటన. కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో కోపర్‌ఖెరాణె-వాశీ మార్గంలో శనివారం ఈ ఘటన జరిగింది. అప్పటికే కారును వెంబడించిన పోలీసులు కిందపడిన ట్రాఫిక్ పోలీసు సిద్ధేశ్వర్‌ను రక్షించారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిని 22 ఏళ్ల ఆదిత్య బెంబ్డేగా గుర్తించారు. ఆ తర్వాత అతడికి జరిపిన వైద్య పరీక్షల్లో మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు తేలింది. హత్యాయత్నం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్, మాదక ద్రవ్యాల చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)