Tamil Nadu: ఇదేం పోయేకాలం, బస్టాప్‌లో విద్యార్థినికి తాళి కట్టిన విద్యార్థి, అక్షింతలు వేసి ఆశీర్వదించిన మిగతా విద్యార్థులు, తమిళనాడు పోలీసులకు చేరిన పంచాయితీ

తమిళనాడులో కడలూరు జిల్లా చిదంబరంలో బస్టాప్ లో జరిగిన ఓ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో బస్టాండ్ వద్ద పాఠశాల యూనిఫాంలో ఉన్న ప్లస్ టు చదువుతున్న విద్యార్థిని మెడలో పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి తాళి కట్టాడు.

man tying mangalsutra around school girl's neck (Photo-Video Grab)

తమిళనాడులో కడలూరు జిల్లా చిదంబరంలో బస్టాప్ లో జరిగిన ఓ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో బస్టాండ్ వద్ద పాఠశాల యూనిఫాంలో ఉన్న ప్లస్ టు చదువుతున్న విద్యార్థిని మెడలో పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి తాళి కట్టాడు. సహచర విద్యార్థులు వారిపై అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.

బస్టాండ్‌లో అమ్మాయి కూర్చుని ఉండగా అబ్బాయి తాళి కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. దీంతో వారు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలల సంక్షేమ అధికారి రమ్య నేతృత్వంలో ఈ ఘటనపై అధికారుల బృందం విచారణ జరుపుతోంది. కాగా, విద్యార్థుల పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన బాలాజీ గణేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement