Viral: షాకింగ్ వీడియో, క్షణం ఆలస్యం అయి ఉంటే రైలు కింద నుజ్జు నుజ్జు అయ్యేవాడు, వేగంగా వచ్చిన రైలు కింద పడి తునాతునకలైన బైక్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది.రైలు కింద పడి ముక్కలు ముక్కలు అయింది ఓ వ్యక్తి బైక్. ఆ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది.రైలు కింద పడి ముక్కలు ముక్కలు అయింది ఓ వ్యక్తి బైక్. ఆ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. గేటు వేసి ఉన్నా పట్టాలపైకి బైక్‌తో వెళ్లాడు. అయితే.. అవతలి ట్రాక్‌పై ఓ రైలు వెళ్తుండటంతో ఈ వైపు ఉన్న పట్టాలపై వేచి ఉన్నాడు.
అప్పుడే మరో రైలు ఆ వ్యక్తి ఉన్న పట్టాలపై దూసుకొస్తోంది. అది గమనించిన సదరు వ్యక్తి బండిని వెనక్కి తిప్పే క్రమంలో పట్టాల మధ్యలో పడిపోయింది. దానిని లాగేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. అక్కడే వదిలేసి వెనక్కి పరిగెట్టాడు. క్షణాల వ్యవధిలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. ద్విచక్రవాహనంపై నుంచి వెళ్లింది. బైక్ తునాతునకలైంది. ఆగస్టు 26న జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రైల్వే పోలీసులు బైక్ యజమానిపై కేసు నమోదు చేశారు.
Here's Video