Viral: ఇలాంటి బౌలింగ్ యాక్షన్ మీరు క్రికెట్ చరిత్రలో చూసి ఉండరు, ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్‌ను అయ్యుండొచ్చు కాని నా జీవితాన్ని కాపాడిందంటూ ట్వీట్ చేసిన బౌలర్
క్రికెట్ ప్రపంచంలో ఎన్నో వింత ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఓఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విలెజ్ క్రికెట్ లీగ్‌లో స్పిన్ బౌలర్ అయిన జార్జ్ మెక్‌మెనెమీ యూనిక్ బౌలింగ్ యాక్షన్‌తో అదరగొట్టాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఇలాంటి బౌలింగ్ ఇంతకముందు ఎప్పుడు చూసి ఉండరు
క్రికెట్ ప్రపంచంలో ఎన్నో వింత ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఓఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విలెజ్ క్రికెట్ లీగ్‌లో స్పిన్ బౌలర్ అయిన జార్జ్ మెక్‌మెనెమీ యూనిక్ బౌలింగ్ యాక్షన్‌తో అదరగొట్టాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఇలాంటి బౌలింగ్ ఇంతకముందు ఎప్పుడు చూసి ఉండరు. ఈ బౌలర్ క్రీజుకు ముందు నిలబడి పరిగెత్తుకు వచ్చినట్లుగా రెండు చేతులను తిప్పాడు. ఆ తర్వాత కాసేపు ఆగి చేతిలోని బంతిని పెట్టుకొని ముందుకు, వెనక్కి జరిగాడు. అనంతరం బంతిని విసిరాడు. అప్పటికే బౌలింగ్‌తో కన్ఫ్యూజ్ అయిన బ్యాటర్ డిఫెన్స్ ఆడాడు.
అయితే తన బౌలింగ్‌పై జార్జ్ మెక్‌మెనెమీ స్వయంగా స్పందిస్తూ.. ''చూడడానికి మీకు సిల్లీగా అనిపించొచ్చు. ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్‌ను అయ్యుండొచ్చు. కానీ ఈ క్రికెట్ నా జీవితాన్ని కాపాడింది. మానసిక సమస్యల నుంచి బయటపడేలా చేసిన క్రికెట్‌కు కృతజ్ఞతలు. నా ప్రదర్శన పట్ల మా అమ్మ గర్వంగా ఫీలవుతుంది. లవ్ యూ క్రికెట్'' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను అతనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.