Bengaluru: వైరల్ వీడియో, బస్సు డ్రైవర్‌కు మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెక్కిరించిన బైకర్, భార్య ముందే అతన్ని చితకబాదిన బస్సు డ్రైవర్, పోలీస్ స్టేషన్‌కి పంచాయితీ

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓవర్‌ టేక్‌ చేసిన బస్సు డ్రైవర్‌కు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మిడిల్‌ ఫింగర్‌ చూపించడంతో ఆగ్రహించిన బస్సు డ్రైవర్‌ ఆ బైకర్‌ను చితకబాదాడు.44 ఏళ్ల సందీప్‌ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం తన భార్యతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. యలహంక ప్రాంతంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ మరో బస్సును ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించాడు.

Representational Image | (Photo Credits: PTI)

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓవర్‌ టేక్‌ చేసిన బస్సు డ్రైవర్‌కు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మిడిల్‌ ఫింగర్‌ చూపించడంతో ఆగ్రహించిన బస్సు డ్రైవర్‌ ఆ బైకర్‌ను చితకబాదాడు.44 ఏళ్ల సందీప్‌ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం తన భార్యతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. యలహంక ప్రాంతంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ మరో బస్సును ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించాడు.

అయితే బైక్‌పై వెళ్తున్న సందీప్‌ దారి ఇవ్వలేదు. బస్సు డ్రైవర్‌ ఓవర్‌ టేక్‌ చేయగా అతడు మిడిల్‌ ఫింగర్‌ను పైకి చూపాడు. దీంతో బైక్‌ను అడ్డగించి బస్సు ఆపిన డ్రైవర్‌ బైక్‌ కీ, సందీప్‌ మొబైల్‌ ఫోన్‌ తీసుకుని బస్సులోకి వెళ్లాడు. సందీప్‌ కూడా బస్సు డ్రైవర్‌ను అనుసరించాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరగగా బస్సు డ్రైవర్‌ సందీప్‌ను ఇష్టానుసారంగా కొట్టాడు. దీంతో ఈ కథ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇద్దరి ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ బస్సును నడుపుతున్న ఆ డ్రైవర్‌ను నియమించిన ప్రైవేట్‌ సంస్థ అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now