Cash Inside Gutkha Pouches: వైరల్ వీడియో, గుట్కా పౌచ్‌లలో రూ.33 లక్షలు అక్రమ రవాణా, బ్యాంకాక్ వెళ్తూ కోల్‌కతా కస్టమ్స్ అధికారులకు దొరికిన నిందితుడు
కోల్‌కతా కస్టమ్స్‌కు చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఈయూ) అధికారులు అతడి లగేజ్‌పై అనుమానం వ్యక్తం చేశారు.
గుట్కా ప్యాకెట్లలో గుట్టుగా దాచిన సుమారు రూ.33 లక్షల విలువైన విదేశీ కరెన్సీ నోట్ల అక్రమ రవాణాను కలకత్తా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు.ఆదివారం ఒక వ్యక్తి బ్యాంకాక్‌కు వెళ్లేందుకు భారీ లగేజ్‌తో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. కోల్‌కతా కస్టమ్స్‌కు చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఈయూ) అధికారులు అతడి లగేజ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ట్రాలీ సూట్‌కేసులను తెరిచి చూడగా వాటి నిండా గుట్కా ప్యాకెట్లు ఉన్నాయి.
కాగా, కస్టమ్స్ అధికారులు గుట్కా పౌచ్‌లను చింపి పరిశీలించారు. ప్రతి పౌచ్‌లో రెండేసి చొప్పున ఉన్న పది డాలర్ల నోట్లను వెలికితీశారు. భారత కరెన్సీలో రూ.32.78 లక్షల విలువైన 40 వేల అమెరికా డాలర్ల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని దీనిపై ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను కోల్‌కతా కస్టమ్స్ అధికారులు విడుదల చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)