Viral Video: భారతీయులు అంటే అంతే మరి.. ఎర్రటి ఎండలో కూడా పెళ్లిని చల్లగా ఎంజాయ్ చేసిన పెళ్లి బృందం, ఎలా అంటారా...ఈ వీడియో చూడాల్సిందే..

కానీ, ఢిల్లీలో ఓ పెళ్లింటి వారు భలే ఐడియా వేశారు. పెళ్లి బరాత్ కు ఒక పెద్ద చలువ పందిరిని సృష్టించారండోయ్. దాని కిందే ఏంచక్కా వధూవరులను ఊరేగించేశారు. అంతేకాదండోయ్.. డప్పులు, డీజే చప్పుళ్లకు బంధువులు కాలు కదిపి స్టెప్పులూ వేశారు.

Wedding Procession Beats Heatwave Internet Says We Are Jugaad King

ఎర్రటి ఎండల్లో పెళ్లి ఊరేగింపు పెట్టుకుంటే..మల మల మాడిపోతాం కదా.. కానీ, ఢిల్లీలో ఓ పెళ్లింటి వారు భలే ఐడియా వేశారు. పెళ్లి బరాత్ కు ఒక పెద్ద చలువ పందిరిని సృష్టించారండోయ్. దాని కిందే ఏంచక్కా వధూవరులను ఊరేగించేశారు. అంతేకాదండోయ్.. డప్పులు, డీజే చప్పుళ్లకు బంధువులు కాలు కదిపి స్టెప్పులూ వేశారు. మొత్తంగా పెళ్లి బరాత్ ను ఎండలోనూ చల్లగా ఎంజాయ్ చేసేశారు. దేవయాని కోహ్లీ అనే మహిళ ట్విట్టర్ లో ఆ వీడియోను పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది. ‘‘అందుకే భారత్ ను ఆవిష్కరణలకు అడ్డా అని అనేది. పెళ్లి బరాత్ కు ఎండ వేడి నుంచి ఉపశమనం, పరిష్కారాన్ని ఇదిగో ఇలా కనుగొన్నారు. ఐడియా సూపర్ కదా’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు