India vs Australia World Cup 2023 Final: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ కు 6 వేల మంది సిబ్బందితో భద్రత: అహ్మదాబాద్‌ సీపీ

మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌ లో (Ahmedabad) వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ (World Cup Final) మ్యాచ్‌ జరుగనుంది.

Security at Ahmedabad Stadium (Credits: X)

Ahmedabad, Nov 19: మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌ లో (Ahmedabad) వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ (World Cup Final) మ్యాచ్‌ జరుగనుంది. టోర్నీలో ఓటమినే ఎరుగని టీమ్‌ఇండియా, ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియా తుదిపోరులో తలపడనున్నాయి. లక్షా ముప్పై వేల మంది అభిమానులు, ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తమిళనాడు, అసోం ముఖ్యమంత్రులతోపాటు అతిరతమహారథులు ఈ మెగా ఫైనల్‌ కు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌ పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 6 వేలకుపైగా మంది సిబ్బందిని మోహరించింది. స్టేడియంతోపాటు ఆటగాళ్లు బసచేస్తున్న హోటళ్లు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తారని అహ్మదాబాద్‌ కమిషనర్‌ జీఎస్‌ మాలిక్‌ చెప్పారు. వీరిలో గుజరాత్‌ పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (RAF), హోమ్‌గార్డులు, ఇతర ఇబ్బందిని ఇందుకోసం వినియోగిస్తున్నామని తెలిపారు.

India vs Australia World Cup 2023 Final: నేడే ఫైనల్‌ ఫైట్‌.. భారత్‌ x ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌ కప్‌ తుది సమరంపై సర్వత్రా ఆసక్తి.. మూడుపై భారత్‌ గురి సిక్సర్‌ పై ఆసీస్‌ నజర్‌