Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌, సెంచరీ పతకాలతో దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రధాని మోదీ అభినందనలు

ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. ఆసియా పారా క్రీడల్లో తొలిసారిగా భారత క్రీడాకారులు 100 పతకాలు గెలవడంతో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌, సెంచరీ పతకాలతో దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రధాని మోదీ అభినందనలు
Asian Para Games 2023 India go past record 100 medal mark in Hangzhou PM Modi says nothing is impossible (photo-X/ANI)

ఆసియా పారా క్రీడల్లో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. ఆసియా పారా క్రీడల్లో తొలిసారిగా భారత క్రీడాకారులు 100 పతకాలు గెలవడంతో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పారా అథ్లెట్ల కఠిన శ్రమ, అంకిత భావం కారణంగానే సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ.. ఇంతకంటే ఆనందం మరొకటి ఉండదంటూ అథ్లెట్లను మోదీ అభినందించారు.

చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో అథ్లెట్‌ దిలీప్‌ మహదు గవిత్‌ పసిడి గెలిచి సెంచరీ మెడల్స్‌ లాంఛనం పూర్తి చేశాడు. ఆసియా పారా క్రీడల్లో భారత్‌ ఇప్పటి వరకు 29 పసిడి, 31 రజత, 51 కాంస్యాలతో 111 పతకాలు కైవసం చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చైనా అత్యధికంగా 214 స్వర్ణాలు, 167 వెండి, 140 కంచు పతకాలతో మొత్తంగా 521 మెడల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. చైనా తర్వాత.. 131 పతకాలతో ఇరాన్‌ రెండో స్థానం ఆ‍క్రమించింది.

Asian Para Games 2023 India go past record 100 medal mark in Hangzhou PM Modi says nothing is impossible (photo-X/ANI)

Here's PM Modi Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

PM Modi to Visit Kuwait: 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని, రెండు రోజుల పాటు ప్రధానమంత్రి మోదీ పర్యటన, చివరిసారిగా 1981లో పర్యటించిన ఇందిరాగాంధీ

India Women Beat West Indies Women: టీమిండియా జైత్ర‌యాత్ర‌, వెస్టిండిస్ పై ఘ‌న విజ‌యం, 2-1 తేడాతో సిరీస్ కైవ‌సం చేసుకున్న మ‌హిళా జ‌ట్టు

Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఎల‌క్ట్రిక్ వెహికిల్ మార్కెట్లోకి వ‌చ్చే తేదీ ఖరారు, మిడ్ రేంజ్ ఎస్ యూవీల్లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న కారు

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif