PV Sindhu: స్వర్ణ పతకం కోసం 5 ఏళ్లు ఎదురు చూశా: పీవీ సింధు

ప్రపంచ క్రీడాయవనికపై భారతదేశ పేరుప్రతిష్టలు ఇనుమడింప చేసిన షట్లర్ పి.వి.సింధు.. తన విజయాలను గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం కోసం తాను అయిదేళ్లు ఎదురు చూశానని అన్నారు.

Credits: Twitter/NDTV

Newdelhi, Feb 5: ప్రపంచ క్రీడాయవనికపై భారతదేశ పేరుప్రతిష్టలు ఇనుమడింప చేసిన షట్లర్ పి.వి.సింధు.. (PV Sindhu) తన విజయాలను గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో (World Championship)  స్వర్ణం కోసం తాను అయిదేళ్లు ఎదురు చూశానని అన్నారు. శనివారం ప్రో వాలీబాల్ లీగ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆమె మీడియాతో ముచ్చటించారు. ‘‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకం సాధించడం చాలా పెద్ద ఘనత. ఒలింపిక్ పతకం తరువాత అంతటి ఆనందం ఈ టోర్నీ విజయంతో వచ్చింది. అప్పటికి నేను స్వర్ణ పతకం కోసం అయిదేళ్లుగా ఎదురు చూస్తున్నా. అంతకుముందు రెండు రజతాలు రెండు కాంస్యాలు గెలిచా. 2019లో ప్రపంచ ఛాంపియన్ అయ్యా’’ అంటూ సింధు అప్పటి ఘటనలను గుర్తు చేసుకున్నారు.

యూపీలోని రాంపూర్ లో అర్థరాత్రి.. ప్రతీ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న నగ్న అవతార స్త్రీ.. ఆమె ఎవరో చెప్పేసిన పోలీసులు.. అసలేం జరిగింది?? వీడియోతో..

2013, 14 ప్రపంచ ఛాపింయన్ షిప్‌‌లలో కాంస్య పతకాలు సాధించిన సింధు 2017,18 టోర్నమెంట్లలో రజతం దక్కించుకున్నారు. 2019 టోర్నమెంట్‌ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒకుహారాపై నెగ్గి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now