
Hyderabad, Dec 23: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం (PV Sindhu Marriage) రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో (Venkata Dattasai) ఆమె మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచినట్టు సమాచారం. పెళ్లి ఫొటోలను ఇరు ఫ్యామిలీలు ఇంకా విడుదల చేయలేదు.
వివాహబంధంలోకి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుhttps://t.co/vVzOeDHKAA#PVSindhuWedding #udaipur #Badminton
— Sakshi (@sakshinews) December 23, 2024
ఇక్కడ పెద్దయెత్తున రిసెప్షన్
రాజస్థాన్ లో జరిగిన సింధు వివాహానికి కొందరు మాత్రమే హాజరయ్యారు. అయితే, మంగళవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పెద్దయెత్తున హాజరుకానున్నట్టు సమాచారం.