Telangana Student Dies In US (Credits: X)

Hyderabad, Dec 23: అమెరికాలో (America) తెలుగు విద్యార్థులు (Telugu Students) అనుమానాస్పద స్థితిలో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా తెలంగాణ‌లోని హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీ అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయాడు. అత‌డు నివాసం ఉంటున్నమిన్నెసొటాలోని అపార్ట్‌ మెంట్‌ లోని సెల్లార్‌ లో ఉన్న కారులో శ‌వ‌మై క‌నిపించాడు. ఈ మేర‌కు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు అక్కడి అధికారులు ఆదివారం నాడు స‌మాచారం ఇచ్చారు.  చేతికి అందివ‌చ్చిన కొడుకు ఇలా తమను విడిచి వెళ్ళడంతో ఆ త‌ల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు. బండి వంశీ మృత‌దేహాన్ని స్వ‌గ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.

వీడియోలు ఇవిగో, అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, పూల కుండీలు ధ్వంసం... బన్నీ తీరుపై ఓయూ జేఎసీ నేతల ఫైర్..ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని మండిపాటు

ఎంఎస్ చదువుతూ.. పార్ట్ టైం జాబ్ చేస్తూ..

హ‌నుమ‌కొండ జిల్లా క‌మ‌లాపూర్ మండ‌లం మాద‌న్న‌పేట గ్రామానికి చెందిన గీత‌కార్మికుడు బండి రాజయ్య‌, ల‌లిత దంప‌తుల రెండో కుమారుడు బండి వంశీ (25). గ‌తేడాది జులైలో ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికాలోని మిన్నెసొటాకు వెళ్లాడు. అక్క‌డ పార్ట్‌ టైం జాబ్ చేస్తూ.. ఎంఎస్ చ‌దువుతున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు ఉంటున్న అపార్ట్‌ మెంట్‌ లోని సెల్లార్‌ లో పార్క్ చేసి ఉన్న ఓ కారులో వంశీ మృతిచెంది ఉండ‌డం అదే అపార్ట్‌ మెంట్‌ లో ఉంటున్న హ‌నుమ‌కొండ జిల్లాకే చెందిన కొందరు యువ‌కులు ఆదివారం ఉద‌యం గుర్తించారు. వెంట‌నే వంశీ పేరెంట్స్‌ కు స‌మాచారం ఇచ్చారు.

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి, రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఓయూ జేఏసీ డిమాండ్..వీడియో