Hyd, Dec 4: అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం ఈ రాత్రి 8.13 గంటలకు జరగనుంది. వీరిద్దరి వివాహం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేక సెట్ వేశారు.
ఈ పెళ్లి నిరాడంబరంగా జరగనుండగా కేవలం 300 మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మెగా, నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యులు హాజరుకానుండగా వివాహం పూర్తిగా హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. పెళ్లికి ముందు పెళ్లి కూతురు డ్రస్‌లో ముస్తాబైన శోభితా ధూళిపాళ, డిసెంబర్ 4న నాగచైతన్యతో ఏడడుగులు వేయనున్న శోభిత
పెళ్లికి సంబంధించిన అతిథుల జాబితాలో మహేశ్‌బాబు, నయనతార, రామ్‌చరణ్, పీవీ సింధు, జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ,నమ్రతా శిరోద్కర్ తదితరులు ఉన్నారు.
నాగ చైతన్య మరియు శోభితా ధూళిపాళల వివాహ వీడియో హక్కులు రూ.50 కోట్ల కు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. మొత్తంగా వీరిద్దరి వివాహం గురించి తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగతోంది.