ICC Women’s World Cup 2025: తొలిసారి వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత్, దేవుని ప్రణాళిక అంటూ హృదయానికి హత్తుకునే పోస్ట్ పెట్టిన షఫాలీ వర్మ, అభినందనల వెల్లువ
ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ దరిచేరింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. షెఫాలీవర్మ, దీప్తిశర్మ అర్ధసెంచరీలతో భారీ స్కోరు అందుకున్న భారత్..స్ఫూర్తిదాయక పోరాటంతో కదంతొక్కింది. లక్ష్యఛేదనలో సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీ పోరాటం సఫలం కాలేకపోయింది.
దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి, టీమ్ ఇండియా ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది షఫాలీ వర్మ అద్భుత ప్రదర్శన.గాయపడ్డ ప్రతికా రావల్ స్థానంలో జట్టులోకి వచ్చిన షఫాలీ వర్మ, ఫైనల్లో బ్యాట్‌తో పాటు బంతితోనూ మెరిసింది. ఆమె 78 బంతుల్లో 87 పరుగులు చేసి జట్టును 50 ఓవర్లలో 298/7 పరుగుల భారీ స్కోరుకు చేర్చింది. అనంతరం బౌలింగ్‌లో కూడా షఫాలీ తన ప్రతిభ చూపించింది. ఆమె వేసిన ఏడు ఓవర్లలో రెండు కీలక వికెట్లు పడగొట్టింది.
ఆమె అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనకు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, షఫాలీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక హృదయానికి హత్తుకునే పోస్ట్ చేసింది. ఆమె X (ట్విట్టర్) లో “02-11-2025… దేవుని ప్రణాళిక” (“God’s Plan…”) అంటూ రాసింది. ఈ పోస్ట్ అభిమానులను ఉత్సాహపరచింది. షఫాలీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Shafali Verma Reacts After Team India Defeat South Africa
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)