Cricketer Asif Hossain Dies: మెట్ల‌పై నుంచి కిందప‌డి వర్థమాన భారత క్రికెటర్ అసిఫ్ హొసేన్ మృతి, సంతాపం తెలిపిన బెంగాల్ క్రికెట్

Representative Image (Photo Credits: File Photo)

బెంగాల్‌కు చెందిన క్రికెట‌ర్ అసిఫ్ హొసేన్ (Asif Hossain) అనుకోకుండా సొంత ఇంటి మెట్ల పైనుంచి ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద ప‌డి ప్రాణాలు కోల్పోయాడు. 28 ఏండ్ల వ‌య‌సులోనే ఆసిఫ్ ఈ లోకాన్ని వీడడం ప‌ట్ల బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్‌తో పాటు ప‌లువురిని షాక్‌కు గురి చేసింది. అసిఫ్ మ‌ర‌ణ‌వార్త తెలిసిన క్రికెట‌ర్లు అత‌డి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నారు.బెంగాల్‌లోని ఇంట్లో అసిఫ్ సోమ‌వారం మెట్ల పైనుంచి జారి కింద ప‌డ్డాడు. తీవ్ర గాయాలపాలైన అత‌డిని కుటుంబ స‌భ్యులు స‌మీపంలోని ప్రైవేట్ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే అసిఫ్ మ‌ర‌ణించాడ‌ని వైద్యులు చెప్పారు. ఎడ‌మ‌చేతి వాటం బ్యాట‌ర్ అయిన అత‌డు  టీ20 లీగ్‌లో  37 బంతుల్లోనే అర్ధ శ‌త‌కంతో చెల‌రేగాడు. అత‌డి అకాల మ‌ర‌ణం ప‌ట్ల బెంగాల్ క్రికెట్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది.

సచిన్ మరో రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 27 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా..

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు