Sachin Tendulkar: వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతున్న అభిమానిని పిలిచి సర్ ప్రైజ్ చేసిన సచిన్, తమ దేవుడిని రోడ్డు మీద చూడగానే అ అభిమాని రియాక్షన్ ఏంటంటే..
సచిన్ టెండూల్కర్ ఎక్స్ ద్వారా ఒక ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. 'సచిన్ ఇవాళ టెండూల్కర్ ను కలిశాడు' అంటూ తన పోస్టుకు హెడ్డింగ్ పెట్టారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... సచిన్ కారులో వెళుతుండగా, టెండూల్కర్ అనే పేరుతో ఉన్న నెం.10 ముంబయి ఇండియన్స్ జెర్సీని ధరించి బైక్ పై అదే రూట్లో ఓ వ్యక్తి వెళ్లడం చూడొచ్చు.
సచిన్ టెండూల్కర్ ఎక్స్ ద్వారా ఒక ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. 'సచిన్ ఇవాళ టెండూల్కర్ ను కలిశాడు' అంటూ తన పోస్టుకు హెడ్డింగ్ పెట్టారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... సచిన్ కారులో వెళుతుండగా, టెండూల్కర్ అనే పేరుతో ఉన్న నెం.10 ముంబయి ఇండియన్స్ జెర్సీని ధరించి బైక్ పై అదే రూట్లో ఓ వ్యక్తి వెళ్లడం చూడొచ్చు. అతడిని గమనించిన సచిన్... తన కారును నిలిపి ఆ బైకర్ ను కూడా ఆపాడు. అప్పుడా వ్యక్తి ముఖంలో కనిపించిన ఫీలింగ్ మాటలకు అందదు.
వెంటనే ఆ వ్యక్తి రెండు చేతులు జోడించి సచిన్ కు నమస్కరించాడు. అంతేకాదు, తన చేతిపై ఉన్న పచ్చ బొట్టును, తన బైక్ కవర్ లో ఉన్న సచిన్ ఫొటోలతో కూడిన బుక్ ను చూపించడంతో సచిన్ సంబరపడిపోయాడు. ఆ బుక్ లో ఆటోగ్రాఫ్ చేసి తన వీరాభిమానిని సంతోషపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్టు చేసిన సచిన్... "నాపై ఆ అభిమాని చూపిన అపారమైన ప్రేమతో నా హృదయం సంతోషంతో నిండిపోయింది. జీవితంలో ఊహించని కోణాల్లోనూ ఇలా వ్యక్తుల నుంచి ప్రేమ లభిస్తుండడం జీవితాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చివేస్తుంది" అని పేర్కొన్నారు.
Here's Video