Virat Kohli Bowling Video: ఆరేళ్ల తరువాత కోహ్లీ బౌలింగ్ వీడియో వైరల్, ఒక ఓవర్ వేసి కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చిన మాజీ కెప్టెన్
టీ20 క్రికెట్‌లో దాదాపు ఆరేళ్ల తర్వాత కోహ్లి బౌలింగ్ చేశాడు.
ఆసియాకప్-2022లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి బౌలింగ్ చేసి అందరనీ ఆశ్చర్యపరిచాడు. టీ20 క్రికెట్‌లో దాదాపు ఆరేళ్ల తర్వాత కోహ్లి బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు. హాంకాంగ్ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన కోహ్లి.. కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు.ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కోహ్లి టీ20ల్లో చివరగా 2016 ఆసియాకప్‌లో బౌలింగ్ చేశాడు.ఇప్పటి వరకు 101 టీ20లు ఆడిన కోహ్లి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)