Asia Cup 2023: సెప్టెంబరు 2న శ్రీలంకలో దాయాదులతో భారత్ పోరు, ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్-2023, పూర్తి షెడ్యూల్ ఇదిగో..
పాకిస్తాన్, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ప్రకటించారు. ట్విటర్ వేదికగా బుధవారం ఈ విషయాన్ని తెలియజేశారు.
క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా వన్డే కప్-2023 షెడ్యూల్ విడుదలైంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ప్రకటించారు. ట్విటర్ వేదికగా బుధవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఆగష్టు 30న ఆరంభం కానున్న ఈ ఈవెంట్ సెప్టెంబరు 17న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.దాయాదులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా తలపడనున్నాయి
విభిన్న దేశాలను ఏకతాటిపై బంధించే ఐక్యత మరియు ఐక్యతకు చిహ్నంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పురుషుల ODI #AsiaCup2023 షెడ్యూల్‌ను ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను! క్రికెట్ శ్రేష్ఠత యొక్క వేడుకలో చేతులు కలుపుదాం మరియు మనందరినీ అనుసంధానించే బంధాలను గౌరవిద్దామని జై షా ట్వీట్ చేశారు.
Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)