Glenn Maxwell Covid: ఆస్ట్రేలియా జట్టులో కరోనా కల్లోలం, బిగ్‌బాష్ లీగ్ జట్టు కెప్టెన్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు కోవిడ్ పాజిటివ్, ఇప్పటికే కరోనా బారీన పడి కోలుకున్న 12 మంది క్రికెటర్లు
ఇప్పటికే 12 మంది క్రికెటర్లు, ఎనిమిది మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు కోవిడ్ సోకింది.
బిగ్‌బాష్ లీగ్ జట్టు మెల్‌బోర్న్ స్టార్స్‌ను కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే 12 మంది క్రికెటర్లు, ఎనిమిది మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు కోవిడ్ సోకింది. యాంటీజెన్ టెస్టులో భాగంగా అతడికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇక అంతకుముందు స్టార్స్ జట్టు ఆటగాళ్లు ఆడం జంపా, నాథన్ కౌల్టర్ నైల్, మార్కస్ స్టొయినిస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే, ఐసోలేషన్ పూర్తి కావడం, కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్‌గా తేలడంతో వీరు తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులోకి రానున్నారు. శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో పాల్గొననున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)