Ranji Trophy Prize Money: బీసీసీఐ గుడ్ న్యూస్, రూ. 2 కోట్ల నుంచి రూ. కోట్లకు పెరిగిన రంజీ ట్రోఫీ ప్రైజ్ మనీ, రంజీ రన్నరప్‌కు రూ.3కోట్లు
భారత క్రికెట్ నియంత్రణ మండలి వచ్చే సీజన్ నుంచి రంజీ ట్రోపీ విజేతకు రూ.5కోట్లు ఇవ్వనున్నది. ఇంతకు ముందు ప్రైజ్‌మనీ రూ.2కోట్లుగా ఉండేది.ఇక రంజీ రన్నరప్‌కు రూ.3కోట్లు చెల్లించనున్నది
భారత క్రికెట్ నియంత్రణ మండలి వచ్చే సీజన్ నుంచి రంజీ ట్రోపీ విజేతకు రూ.5కోట్లు ఇవ్వనున్నది. ఇంతకు ముందు ప్రైజ్‌మనీ రూ.2కోట్లుగా ఉండేది.ఇక రంజీ రన్నరప్‌కు రూ.3కోట్లు చెల్లించనున్నది. దాంతో పాటు మహిళల క్రికెట్ టోర్నీ ప్రైజ్‌మనీని పెంచింది. మహిళల వన్డే ట్రోఫీ విజేతకు రూ.50లక్షలు, టీ20 ట్రోఫీ విజేతకు రూ.40లక్షలు చెల్లించనున్నది.
ఇక ఇరానీ కప్ విజేతకు రూ.50లక్షలు, రన్నరప్‌కు రూ.25లక్షలు ఇవ్వనున్నది. దులీప్ ట్రోఫీ విజేతకు రూ.కోటి, రన్నర్‌కు రూ.50లక్షలు, విజయ్ హజారే టోర్నీని గెలుపొందిన జట్టుకు రూ.కోటి, రన్నర్‌కు రూ.50లక్షలకు ప్రైజ్‌మనీని పెంచింది. ప్రొఫెసర్ డీబీ దేవధర్ టోర్నీ విజేతకు రూ.40లక్షలు, రన్నర్‌కు రూ.20లక్షలు, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ విజేతకు రూ.80లక్షలు, రన్నరప్‌కు రూ.40లక్షలు, సీనియర్స్ వుమెన్స్ వన్డే ట్రోఫీ విజేతకు రూ.50లక్షలు, రన్నరప్‌కు రూ.25లక్షలు, సీనియర్స్ వుమెన్స్ టీ20 టోర్నీ విజేతకు 40లక్షలు, రన్నర్‌కు రూ.20లక్షలు చెల్లించనున్నట్లు బీసీసీ ప్రకటించింది.
Here's Shah Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)