BCCI Sacks Chief Selector: సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ, చీఫ్‌ సెలక్టర్‌తో పాటూ మొత్తం టీమ్‌ను తొలగిస్తూ నిర్ణయం, కొత్త కమిటీ కోసం దరఖాస్తుల ఆహ్వానం

బీసీసీఐ (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మతో (Chetan Sharma) పాటూ మొత్తం సెలక్షన్ బోర్డును తొలగించింది. ఇటీవల టీ-20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) టీమిండియా ఓటమి ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Indian Cricket Team. (Photo Credits: Twitter@imVkohli)

New Delhi, NOV 18: బీసీసీఐ (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మతో (Chetan Sharma) పాటూ మొత్తం సెలక్షన్ బోర్డును తొలగించింది. ఇటీవల టీ-20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) టీమిండియా ఓటమి ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చీఫ్ సెలక్షన్ కమిటీ (All India Selection Committee) నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీని 2020 డిసెంబర్‌ లో నియమించింది. అప్పటి నుంచి సెలక్షన్ కమిటీ పలు టోర్నీలకు టీమ్‌లను ఖరారు చేసింది. అయితే ఇటీవల టీమ్‌ ఫర్మామెన్స్ సరిగ్గా లేకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now