Bhuvneshwar Kumar: అక్తర్ ఫాస్ట్ బాల్ రికార్డును భువీ నిజంగానే బద్దలు కొట్టాడా, 208 Km/h వేగంతో భువీ బాల్ విసరాడంటూ ట్వీట్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్
ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా సేన ఐర్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందడంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు.
ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా సేన ఐర్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందడంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా భువీ బౌలింగ్ చేస్తున్నపుడు స్పీడోమీటర్ రెండుసార్లు గంటకు 200కు పైగా కిలోమీటర్ల వేగంతో అతడు బంతి విసిరినట్లు చూపడం గమనార్హం.
ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌కు భువీ వేసిన బాల్ 201 Km/h, అదే విధంగా బల్బిర్నీకి 208 Km/h వేగంతో బంతిని (Bhuvneshwar Kumar's 208 Kph) విసిరినట్లు చూపింది. నిజానికి అంతర్జాతీయ మ్యాచ్‌లో అత్యంత వేగంగా బంతిని విసిరిన రికార్డు పాకిస్తాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్(161.3 km/h) పేరిట ఉంది. అయితే, భువీ నిజంగా ఈ ఫీట్ నమోదు చేశాడా లేదంటే సాంకేతిక తప్పిదం కారణంగా స్పీడోమీటర్ ఇలా చూపిందా అన్న విషయం అంతుబట్టక నెటిజన్లు తికమకపడుతున్నారు.
అదే సమయంలో.. భువీని కొనియాడుతూ.. ‘‘తప్పో.. ఒప్పో.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. ఇంతకీ షోయబ్ అక్తర్’’ ఎవరూ (Fans Ask 'Shoaib Akhtar Who) అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా స్పీడోమీటర్‌లో చూపింది విండ్‌స్పీడ్‌రా బాబూ అంటూ మరికొంత మంది పేర్కొంటున్నారు. ఏదేమైనా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Here's Tweets
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)