Sameer Rizvi: యువ ఆటగాడు సమీర్ రిజ్వీ కోసం ఏకంగా రూ.8.40 కోట్లు ఖర్చుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్, ఎవరీ యువ సంచలనం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో యువ బ్యాటింగ్ సంచలనం సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 8 40 కోట్లకు సొంతం చేసుకుంది. రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన సమీర్‌ రిజ్వీని రూ.8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్‌ కింగ్స్ దక్కించుకుంది.

Sameer-Rizvi

IPL 2024 కోసం చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో యువ బ్యాటింగ్ సంచలనం సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 8 40 కోట్లకు సొంతం చేసుకుంది. రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన సమీర్‌ రిజ్వీని రూ.8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్‌ కింగ్స్ దక్కించుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌, ఢిల్లీ చెన్నై మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆఖరికి పోటీ నుంచి గుజరాత్‌, ఢిల్లీ తప్పుకోగా సీఎస్‌కే దక్కించుకుంది.

రిజ్వీకు టీ20 క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. కేవలం 9 ఇన్నింగ్స్‌లలో రిజ్వీ 49.16 సగటుతో 295 పరుగులు చేశాడు. ఈ ఏడాది జరిగిన యూపీ టీ20 లీగ్‌లో రిజ్వీ దుమ్మురేపాడు.ఈ లీగ్‌లో కన్పూర్‌ సూపర్‌ స్టార్స్‌ తరపున ప్రాతినిథ్యం వహించిన రిజ్వీ.. 455 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కూడా రిజ్వీ అదరగొట్టాడు. ఈ టోర్నీలో ఓవరాల్‌గా 18 సిక్స్‌లు రిజ్వీ కొట్టాడు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement