IND vs PAK: కామన్వెల్త్ గేమ్స్ వేదికపై టీ 20 మ్యాచులో పాకిస్థాన్ ను చిత్తు చేసిన టీమిండియా మహిళా క్రికెట్ జట్టు...

కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళా క్రికెట్ జట్టు పాక్పై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.

IND vs PAK

కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళా క్రికెట్ జట్టు పాక్పై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 100 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత జట్టు..11.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతీ మందానా హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించింది. మరో ఓపెనర్ షఫాలీ శర్మ 16 పరుగులతో పర్వాలేదనిపించింది. పాక్ బౌలర్లలో తుబా హసన్ ఒక వికెట్ పడగొట్టింది.  వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో  పాకిస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే భారత బౌలర్ల ధాటికి 99 పరుగులకే ఆలౌట్ అయింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now