Dattajirao Gaekwad Dies: భారత క్రికెట్లో తీవ్ర విషాదం, టీమిండియా మాజీ కెప్టెన్ దత్తా గైక్వాడ్ కన్నుమూత

గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు

Dattajirao Gaekwad (Photo Credit: Twitter/@mpparimal)

టీమిండియా మాజీ కెప్టెన్‌, అందరూ ముద్దుగా దత్తా గైక్వాడ్ అని పిలుచుకునే దత్తాజీరావు గైక్వాడ్(95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అతని పూర్తి పేరు దత్తాజీరావు కృష్ణారావు.భారత తరపున 11 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్‌.. 18.42 సగటుతో 350 పరుగులు చేశారు.

1959 ఇంగ్గండ్‌ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా దత్తాజీ వ్యవహరించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ ఓటమి పాలైంది. ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కూడా 1947 నుంచి 1961 కాలంలో బరోడాకు ప్రాతినిథ్యం వహించారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 47.56 సగటుతో 3139 పరుగులు చేశారు. అందులో 14 సెంచరీలు ఉన్నాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)