David Warner Completes 100 Sixes in ODI: డేవిడ్ వార్నర్ మరో రికార్డు, వన్డే క్రికెట్‌లో వంద సిక్సర్లు పూర్తి చేసిన 43వ ఆటగాడిగా రికార్డు
మొహాలీ వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ అశ్విన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన వార్నర్.. అంతర్జాతీయ వన్డేల్లో 100 సిక్సర్లు బాదిన 43వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్‌లో వంద సిక్సర్లు పూర్తి చేశాడు. మొహాలీ వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ అశ్విన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన వార్నర్.. అంతర్జాతీయ వన్డేల్లో 100 సిక్సర్లు బాదిన 43వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ ఈ సిక్సర్‌తో పాటు మరో సిక్సర్ కూడా బాది తన సిక్సర్‌ల సంఖ్యను 101కి (148 మ్యాచ్‌ల్లో) పెంచుకున్నాడు.ఈ ఇన్నింగ్స్‌లో 53 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (331), రోహిత్ శర్మ (286), సనత్ జయసూర్య (270), ఎంఎస్ ధోని (229) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. భారత ఆటగాళ్లు సచిన్ (195), గంగూలీ (190), యువరాజ్ సింగ్ (155), విరాట్ కోహ్లి (141), సెహ్వాగ్ (136), సురేశ్ రైనా (120) 100 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)