Dewald Brevis Catch Video: బాబోయ్ ఇదేమి క్యాచ్, శ‌రీరాన్ని విల్లులా వెన‌క్కి వంచి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ పట్టిన బ్రెవిస్, బిత్తరపోయిన బ్యాటర్

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025లో భాగంగా బుధవారం ఎంఐ కేప్ టౌన్‌, స‌న్‌రైజ‌ర్స్ ఈస్టర్న్ కేప్ జ‌ట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సఫారీ ఎంఐ యువ ఆట‌గాడు డెవాల్డ్ బ్రెవిస్ అదిరే క్యాచ్‌తో మెరిశాడు. అద్బుత విన్యాసంతో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ టామ్ అబెల్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు

Dewald Brevis' one-handed stunner sends Tom Abell back to pavilion (photo-Video Grab)

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025లో భాగంగా బుధవారం ఎంఐ కేప్ టౌన్‌, స‌న్‌రైజ‌ర్స్ ఈస్టర్న్ కేప్ జ‌ట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సఫారీ ఎంఐ యువ ఆట‌గాడు డెవాల్డ్ బ్రెవిస్ అదిరే క్యాచ్‌తో మెరిశాడు. అద్బుత విన్యాసంతో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ టామ్ అబెల్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.స‌న్‌రైజ‌ర్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన కార్బిన్ బాష్ ఆఖ‌రి బంతిని షార్ట్ పిచ్ డెలివ‌రీగా అబెల్‌కు సంధించాడు. ఆ బంతికి అబెల్ డీప్ స్క్వేర్ లెగ్ దిశ‌గా భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించాడు. షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ కావ‌డంతో అంతా సిక్స్ అని భావించారు.

క్రికెట్ చరిత్రలో ఇలాంటి ర‌నౌట్‌ మీరు ఎప్పుడూ చూసి ఉండరు, బంతి బ‌లంగా ఫీల్డ‌ర్‌కు త‌గ‌లి మ‌ళ్లీ వ‌చ్చి వికెట్ల‌ను తాకింది, వీడియో చూసేయండి

కానీ బౌండ‌రీ లైన్‌వ‌ద్ద ఉన్న బ్రెవిస్ గాల్లోకి దూకి త‌న శ‌రీరాన్ని విల్లులా వెన‌క్కి వంచి మ‌రి సింగిల్ హ్యాండ్‌తో బ్రెవిస్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్యాట‌ర్‌తో పాటు స‌హ‌చ‌ర ఆట‌గాళ్లంతా బిత్త‌ర పోయారు. ఇది చూసిన నెటిజ‌న్లు క్రికెట్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ క్యాచ్ అంటూ అభివ‌ర్ణిస్తున్నారు. కాగా ఈ టోర్నీలో అంత‌కుముందు జోబ‌ర్గ్ సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్‌ను కూడా ఇదే త‌ర‌హాలో క్యాచ్ ప‌ట్టి పెవిలియ‌న్‌కు పంపాడు.

Dewald Brevis' one-handed stunner sends Tom Abell back to pavilion 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement