Dipendra Singh Airee: యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు కొట్టిన పసికూన ప్లేయర్, 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన నేపాల్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఆరీ
మంగోలియాతో మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చిత్తు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే హాప్ సెంచరీ సాధించి చరిత్రకెక్కాడు.
Asian Games Mens T20I 2023- Nepal vs Mongolia: నేపాల్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఆరీ పరుగుల వరద పారించాడు. మంగోలియాతో మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చిత్తు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే హాప్ సెంచరీ సాధించి చరిత్రకెక్కాడు.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట(ఇంగ్లండ్ మీద 12 బంతుల్లో) ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
ఐదోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఈ ఆల్‌రౌండర్ 10 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లోనే వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. 23 ఏళ్ల దీపేంద్ర సింగ్ ఆరీ 2018లో నేపాల్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ఇప్పటి వరకు 52 వన్డేలు, 38 టీ20లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 889, 991 పరుగులు సాధించాడు.ఇక ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ ఖాతాలో వన్డేల్లో 36, టీ20లలో 21 వికెట్లు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ వన్డేల్లో ఈ రైట్ హ్యాండ్‌బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 105, టీ20లలో 110 కావడం విశేషం.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)