World Cup 2023: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే కిక్ ఇచ్చిన జానీ బెయిర్‌స్టో, తొలి ఓవర్ రెండో బంతికే సిక్స్ బాది సరికొత్త రికార్డు
భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో క్రికెట్ అభిమానులకు ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అదిరిపోయే కిక్ ఇచ్చాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) ప్రారంభమైన టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో బంతికే సిక్సర్ బాదాడు.
భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో క్రికెట్ అభిమానులకు ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అదిరిపోయే కిక్ ఇచ్చాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) ప్రారంభమైన టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో బంతికే సిక్సర్ బాదాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్‌లో రెండో బంతినే సిక్సర్‌కు తరలించడం ద్వారా బెయిర్‌స్టోతో పాటు ఇంగ్లండ్ జట్టు రికార్డుపుటల్లోకెక్కింది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. టోర్నీలో తొలి పరుగులు సిక్సర్ రూపంలో రావడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ షాట్‌తో బెయిర్‌స్టోతో పాటు ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ చరిత్రపుటల్లోకెక్కింది. తొలి ఓవర్‌లో బెయిర్‌స్టో సిక్సర్‌తో పాటు మరో బౌండరీ కూడా బాదాడు. తద్వారా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో 12 పరుగులు సాధించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)