Mohammad Hussain Dies: పాకిస్థాన్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం, మాజీ క్రికెటర్ మహ్మద్ హుస్సేన్ కన్నుమూత, సంతాపం తెలిపిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు

పాకిస్థాన్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ క్రికెటర్‌ మహ్మద్ హుస్సేన్ 45 ఏళ్ల వయసులో ఆకాల మరణం చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు డయాబెటిక్‌ కూడా అయిన హుస్సేన్‌.. సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు

Former Pakistan spinner Mohammad Hussain (Photo-PCB/Twitter)

పాకిస్థాన్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ క్రికెటర్‌ మహ్మద్ హుస్సేన్ 45 ఏళ్ల వయసులో ఆకాల మరణం చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు డయాబెటిక్‌ కూడా అయిన హుస్సేన్‌.. సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. హుస్సేన్‌ అకాల మరణంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ.. హుస్సేన్‌ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

మహ్మద్‌ హుస్సేన్‌ 1996-98 మధ్యలో పాకిస్థాన్ తరఫున 2 టెస్ట్‌లు, 14 వన్డేలు ఆడాడు. ఇందులో 172 పరుగులు సాధించి, 16 వికెట్లు పడగొట్టాడు. ఇండిపెండెన్స్‌ కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హుస్సేన్‌ 4 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా రాణించలేకపోయిన హుస్సేన్‌.. పాక్‌ దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. 131 మ్యాచ్‌ల్లో 454 వికెట్లు సాధించాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement