IPL 2021: చెత్త వ్యాఖ్యలు చేయకండి..మేము మనుషులమే, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విమర్శలపై కౌంటర్ విసిరిన రాయల్ చాలెంజర్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్
మేమూ మనుషులమే. ప్రతిరోజు మా అత్యుత్తమ స్థాయి కనబరిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. అసభ్యంగా ప్రవర్తించే బదులు కొంచెం డీసెంట్‌గా ఉండేందుకు ప్రయత్నించండి’’ అంటూ రాయల్ చాలెంజర్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సీరియస్ అయ్యాడు
కొంతమంది సోషల్ మీడియా వేదికగా చెత్తగా వాగుతున్నారు. మేమూ మనుషులమే. ప్రతిరోజు మా అత్యుత్తమ స్థాయి కనబరిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. అసభ్యంగా ప్రవర్తించే బదులు కొంచెం డీసెంట్‌గా ఉండేందుకు ప్రయత్నించండి’’ అంటూ రాయల్ చాలెంజర్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సీరియస్ అయ్యాడు. సామాజిక మాధ్యమాల్లో తనను, తమ జట్టును విమర్శిస్తున్న వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా తమకు అండగా నిలబడ్డ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఈ ఏడాది ఆర్సీబీ తరఫున బరిలో దిగిన మాక్సీ 513 పరుగులు చేశాడు. ఇక సోమవారం నాటి మ్యాచ్‌లో అతడు.. 18 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)