IPL 2023: వీడియో ఇదిగో, ఆ బాల్ నోబాల్ కాకుండా ఉండి ఉంటే చెన్నై ఓటమి పాలయ్యేదా, రుతురాజ్ గైక్వాడ్ 60 పరుగులు ఎంత విలువైనవంటే..

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌టైటాన్స్‌తో క్వాలిఫయర్‌-1 పోరులో సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌కు ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే నోబాల్‌ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. రుతురాజ్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దర్శన్‌ నల్కండే బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Ruturaj Gaikwad

మూడో బంతిని గైక్వాడ్‌ మిడ్‌ వికెట్‌ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న గిల్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్‌ తీసుకున్నాడు. డేంజరస్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ వెనుదిరగడంతో తొలి వికెట్‌ దక్కిందన్న సంతోషం దర్శన్‌ నల్కండే మొహంలో కనిపించింది. కానీ మరుక్షణమే ఆ సంతోషం ఆవిరైంది. అంపైర్‌ నోబాల్‌ ప్రకటించడంతో రుతురాజ్‌ ఊపిరి పీల్చుకొని వెనక్కి వచ్చాడు. అలా నోబాల్‌ అవడంతో బతికిపోయిన రుతురాజ్‌ ఆ తర్వాత 60 పరుగులు చేసి ఔటయ్యాడు. వీడియో ఇదిగో..

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now