Harbhajan Singh: సచిన్ వంద సెంచరీ రికార్డును కోహ్లీ బద్దలుగొట్టేస్తాడు: హర్భజన్ సింగ్
దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ సాధించి కోహ్లీ పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన చివరి టెస్టులో భారీ సెంచరీ (186) సాధించిన ఈ ఆటగాడు.. తన టెస్టు సెంచరీల సంఖ్యను 28కి పెంచుకున్నాడు.
Newdelhi, March 14: దాదాపు మూడేళ్ల తర్వాత (After Three Years) సెంచరీ (Century) సాధించి కోహ్లీ (Kohli) పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన చివరి టెస్టులో భారీ సెంచరీ (186) సాధించిన ఈ ఆటగాడు.. తన టెస్టు సెంచరీల సంఖ్యను 28కి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) మాట్లాడుతూ.. కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ త్వరలోనే సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును తుడిచిపెట్టేస్తాడని జోస్యం చెప్పాడు. నిజానికి కోహ్లీ సచిన్ సెంచరీల కంటే ఎక్కువే చేస్తాడని అన్నాడు. కోహ్లీ వయసు 34 ఏళ్లు అయినా ఫిట్‌నెస్ పరంగా 24 ఏళ్ల కుర్రాడిలా ఉన్నాడని, దీనికి తోడు అతడి ఖాతాలో ఇప్పటికే 75 సెంచరీలు ఉన్నాయని అన్నాడు. ఈ లెక్కన చూసుకుంటే కోహ్లీ మరో 50 సెంచరీలు చేయగలడని భావిస్తున్నట్టు చెప్పాడు.