Haris Rauf Loses Cool: వీడియో ఇదిగో, ఓడిపోయారని కామెంట్ చేసిన అభిమానితో గొడవ పడ్డ పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌

ఇందుకు ప్రతిగా రౌఫ్‌ సైతం గట్టిగానే స్పందించాడు. తాను ఓ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ అన్న విషయాన్ని మరిచి అభిమానిపై దాడికి యత్నించాడు. కూడా ఉన్న భార్య వారించినా రౌఫ్‌ వినలేదు. ఆ అభిమానిపైకి ఒంటికాలితో దూసుకెళ్లాడు.

Haris Rauf Loses Cool, Gets Involved in Ugly Spat With Fan

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో పాక్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. గ్రూప్‌-ఏలో పాక్‌.. భారత్‌, యూఎస్‌ఏ చేతుల్లో ఓటమిపాలై సూపర్‌-8కు అర్హత సాధించలేకపోయింది. పాక్‌ కంటే మెరుగ్గా రాణించిన ఆతిథ్య దేశం యూఎస్‌ఏ.. భారత్‌తో పాటు సూపర్‌-8లోకి ప్రవేశించింది. తాజాగా పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. వీడియో ఇదిగో, ఒకే ఓవర్‌లో 36 పరుగులు పిండుకున్న వెస్టిండీస్ నికోలస్ పూరన్, బలైన ఆప్ఘన్ బౌలర్ అజ్మతుల్లా

భార్యతో కలిసి అమెరికా వీధుల్లో షికారుకు వెళ్లిన రౌఫ్‌పై ఓ అభిమాని మాటల దాడికి దిగాడు. ఇందుకు ప్రతిగా రౌఫ్‌ సైతం గట్టిగానే స్పందించాడు. తాను ఓ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ అన్న విషయాన్ని మరిచి అభిమానిపై దాడికి యత్నించాడు. కూడా ఉన్న భార్య వారించినా రౌఫ్‌ వినలేదు. ఆ అభిమానిపైకి ఒంటికాలితో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతని చెప్పులు సైతం జారిపోయినా పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇండియన్‌లా ఉన్నాడు అందుకే తిడుతున్నాడన్న హారిస్ రవుఫ్.. కాదు పాకిస్తానీనే అందుకే తిడుతున్నానన్న అభిమాని.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)