టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ రికార్డుల మోత మోగిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో గత రాత్రి జరిగిన గ్రూప్-సి చివరి మ్యాచ్‌లో 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విండీస్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డుతో పాటు ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును సమం చేసింది.
అజ్మతుల్లా ఒమర్‌జాయ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో విండీస్ స్టార్ నికోలస్ పూరన్ ఏకంగా 36 పరుగులు పిండుకున్నాడు. ఒమర్‌జాయ్ ఒక నోబాల్, ఐదు వైడ్లు వేయడంతోపాటు మూడు సికర్లు, రెండు ఫోర్లు సమర్పించుకున్నాడు. అజ్మతుల్లా వేసిన నాలుగో ఓవర్ తొలి బంతిని పూరన్ స్టాండ్స్‌లోకి తరలించాడు. రెండోబంతి నోబాల్ కావడంతో ఫ్రీ హిట్ వచ్చింది. ఆ తర్వాత 5 వైడ్లు వేశాడు. ఆ తర్వాతి బంతికి పరుగులేమీ రాలేదు. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు వచ్చాయి. దీంతో మూడో ఓవర్‌లో 37/1తో ఉన్న విండీస్ స్కోరు ఓవర్ ముగిసే సరికి 73/1కి చేరుకుంది.
Here's Video
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)