ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా నిన్న‌ ఆఫ్ఘ‌నిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓటమి పాలైన సంగతి విదితమే. ఎనిమిది ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్‌ జ‌ట్టును ఓడించింది. చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో ఆఫ్ఘాన్‌ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ను క‌ట్ట‌డి చేయ‌డంతో మ్యాచ్ ఊహించిన మ‌లుపు తిరిగింది. ఆఫ్ఘనిస్థాన్ బౌల‌ర్లు మ్యాజిక్ చేసి, మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. దాంతో టోర్నీలో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో జాస్ బ‌ట్ల‌ర్ సేన ఓట‌మి చ‌విచూసింది.

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్‌ ఔట్, అప్ఘనిస్తాన్‌తో పోరులో చివరి వరకు పోరాడినా ఇంటికెళ్లక తప్పలేదు

ఈ ప‌రాజ‌యంతో ఇంగ్లండ్ ఇంటిముఖం ప‌ట్టింది. 326 పరుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఆ జ‌ట్టు 317 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో జో రూట్ శ‌తకం (120) చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. చివ‌రి వ‌ర‌కు జ‌ట్టును గెలిపించేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ, అత‌ను ఔటైన త‌ర్వాత మ్యాచ్ చేజారింది. దాంతో మ్యాచ్ ఓడిపోయిన త‌ర్వాత స్టార్ బ్యాట‌ర్ క‌న్నీళ్లు (Joe Root Crying Video) పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Joe Root In Tears After Afghanistan Knock England Out

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)