Dubai, FEB 26: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో (England) జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్ 8 పరుగుల తేడాతో విజయం (AFG Win by 8 Runs) సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 326 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో అఫ్గాన్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోగా.. ఇంగ్లాండ్ వరుసగా రెండో ఓటమితో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. జో రూట్ (120; 111 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ బాదినా ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు.
England Knocked Out of ICC Champions Trophy 2025
Defeat in Lahore.
A thrilling run chase but we can't get over the line. pic.twitter.com/gOsBUQRhq2
— England Cricket (@englandcricket) February 26, 2025
బెన్ డకెట్ (38), జోస్ బట్లర్ (38), జేమీ ఒవర్టన్ (27) పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5, మహమ్మద్ నబీ 2, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నైబ్, ఫజల్ హక్ ఫారూఖి ఒక్కో వికెట్ పడగొట్టారు.