Hashim Amla Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు మరో క్రికెటర్ గుడ్‌బై, అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సౌతాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమ్లా.. తాజాగా మిగతా ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు
సౌతాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ (జనవరి 18) ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమ్లా.. తాజాగా మిగతా ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.అంతర్జాతీయ క్రికెట్‌లో 55 సెంచరీల సాయంతో 18000కు పైగా పరుగులు చేసిన ఆమ్లా.. వన్డేల్లో వేగంగా 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. సౌతాఫ్రికా టెస్ట్ టీమ్ కెప్టెన్‌గానూ వ్యవహరించిన ఆమ్లా.. వన్డేల్లో అత్యంత వేగంగా 10, 15, 16, 17, 18, 20, 25, 27 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆమ్లా ఖాతాలో టెస్ట్‌ల్లో ట్రిపుల్ హండ్రెడ్ (311 నాటౌట్)తో పాటు ఐపీఎల్‌లోనూ 2 సెంచరీలు ఉన్నాయి.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)