BBL 2021–22: మీది ఎంత పెద్దదిగా ఉంది, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కి షాకిచ్చిన మహిళా కామెంటేటర్, తేరుకుని నవ్వేసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
క్యారమ్ బాల్ ప్రస్తావన రాగానే తోటి కామెంటేటర్.. '' క్యారమ్ బాల్ వేయాలంటే .. ఒక బౌలర్ మధ్య వేలును ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం'' అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇసా గుహా.. ''మరి మీది ఎంత పెద్దదిగా ఉంది'' (How Big Is Yours) అని డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా మాట్లాడడంతో (Isa Guha's Ambiguous Query Leaves Adam Gilchrist ) గిల్‌క్రిస్ట్ ఒక్కసారిగా నవ్వేశాడు.
బిగ్‌బాష్ లీగ్ 2021లో భాగంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 12న మెల్‌బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు , వికెట్ కీపర్ మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో (Adam Gilchrist) పాటు మరో ఇద్దరు కామెంటేటర్స్‌గా వ్యవహరించారు. వీరిలో ఇసా గుహా (Isa Guha) అనే మహిళ కూడా ఉంది. మ్యాచ్ సందర్భంగా కామెంటరీ ప్యానెల్ మధ్య స్పిన్ బౌలింగ్‌లో ఉండే టెక్నిక్స్ అంశం చర్చకు వచ్చింది.
క్యారమ్ బాల్ ప్రస్తావన రాగానే తోటి కామెంటేటర్.. '' క్యారమ్ బాల్ వేయాలంటే .. ఒక బౌలర్ మధ్య వేలును ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం'' అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇసా గుహా.. ''మరి మీది ఎంత పెద్దదిగా ఉంది'' (How Big Is Yours) అని డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా మాట్లాడడంతో (Isa Guha's Ambiguous Query Leaves Adam Gilchrist ) గిల్‌క్రిస్ట్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఇది చూసిన మిగతా టెక్నిషియన్స్ కూడా మొదట ఆశ్చర్యపోయినా నవ్వడం షురూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తోనే మజాకా''.. అంటూ కొందరు.. ''డబుల్ మీనింగ్ మరీ ఎక్కువైంది'' అంటూ మరి కొందరు కామెంట్స్ తో రక్తి కట్టిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)