Yuvraj Singh: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024 బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా యువ‌రాజ్ సింగ్, జూన్ 9వ తేదీన భార‌త్‌, పాకిస్థాన్ హైఓల్టేజీ మ్యాచ్

2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఎంపిక‌అయినట్లు ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.ఇందులో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో యువ‌రాజ్ పాల్గొన‌నున్నాడు.

ICC Names Yuvraj Singh As Brand Ambassador For Upcoming Men's T20 World Cup 2024

2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఎంపిక‌అయినట్లు ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.ఇందులో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో యువ‌రాజ్ పాల్గొన‌నున్నాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ టోర్నీ ముగిసిన తర్వాత జూన్ 2వ తేదీ నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. జూన్ 29న జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది. టీ20 వరల్డ్ కప్-2024కు వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించిన టీమిండియా జట్టు ఇదిగో, హార్థిక్ పాండ్యాకు రెస్ట్, రిషబ్ పంత్ కు చోటు

అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జ‌ట్లు, ఐదు గ్రూపులుగా విడిపోయి త‌ల‌ప‌డ‌నున్నాయి. గ్రూప్‌-ఏలో టీమిండియాతో పాటు కెన‌డా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. జూన్ 5వ తారీఖున ఐర్లాండ్‌తో భార‌త్ తొలి మ్యాచ్ ఆడ‌నుంది. ఇక టోర్నీలోనే హైఓల్టేజీ మ్యాచ్ అయిన భార‌త్‌, పాకిస్థాన్ పోరుకు న్యూయార్క్ వేదిక కానుంది. జూన్ 9వ తేదీన ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement