ICC New Rule: స్టాప్ క్లాక్ పేరుతో ఐసీసీ కొత్త రూల్, ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకన్ల లోపు కొత్త ఓవర్ ప్రారంభించాల్సిందే, లేకుంటే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు
ఈ రూల్ ప్రకారం ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకన్ల లోపు కొత్త ఓవర్ ప్రారంభించాల్సి ఉంటుంది.
పొట్టి క్రికెట్‌లో రేపట్నుంచి మరో కొత్త నిబంధనను ఐసీసీ తీసుకువస్తోంది.ఓవర్ పూర్తయ్యాక మళ్లీ ఓవర్ వేసేందుకు మధ్య ఉన్న వ్యవధిలో సమయం వృధా కాకుండా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్టాప్ క్లాక్ పేరుతో కొత్త రూల్ తీసుకువస్తోంది. ఈ రూల్ ప్రకారం ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకన్ల లోపు కొత్త ఓవర్ ప్రారంభించాల్సి ఉంటుంది.
ఈ రూల్ అమలు చేసేందుకు ఓ ఎలక్ట్రానిక్ క్లాక్ ను స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. ఇది 60 నుంచి 0 వరకు కౌంట్ డౌన్ చేస్తుంది. ఫీల్డింగ్ జట్లు నిర్ణీత సమయంలోపు కొత్త ఓవర్ లో తొలి బంతిని విసరలేకపోతే ఆ జట్టుకు రెండు హెచ్చరికలు జారీ చేస్తారు. తద్వారా ఐదు పరుగుల జరిమానా విధించే వీలుంటుంది. వికెట్ పడినప్పుడు మైదానంలోకి కొత్త బ్యాట్స్ మన్ వచ్చిన సమయంలో ఈ నిబంధన వర్తించదు. డ్రింక్స్ సమయంలోనూ, గాయపడిన ఆటగాడు మైదానంలో చికిత్స పొందేందుకు అంపైర్లు అనుమతించినప్పుడు, ఫీల్డింగ్ జట్టుకు సంబంధించని కారణాలతో సమయం వృథా అయినప్పుడు కూడా ఈ నిబంధన వర్తించదు.
41.9 నిబంధన కింద ఈ కొత్త రూల్ తెచ్చేందుకు ఐసీసీ కసరత్తులు చేస్తోంది. తొలుత దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు జరిగే దాదాపు 59 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఈ కొత్త రూల్ ను అమలు చేసి పరిశీలిస్తారు. డిసెంబరు 12న వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే తొలి టీ20 ద్వారా ఈ నూతన నిబంధన తీసుకురానున్నారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)