IND vs NED: నెదర్లాండ్స్‌ బౌలర్లను ఆడుకున్న భారత బ్యాటర్లు, 20 ఓవర్లలో రెండు వికెట్లు ​కోల్పోయి 179 పరుగులు, అర్థ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ, రోహిత్, సూర్యకుమార్

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు ​కోల్పోయి 179 పరుగులు సాధించింది.

Virat Kohli, Suryakumar Yadav

టీ20 వరల్డ్‌కప్‌-2022 సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 27) భారత్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్న సంగతి విదితమే. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు ​కోల్పోయి 179 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(62 నాటౌట్‌), రోహిత్‌ శర్మ(53), సూర్యకుమార్‌ యాదవ్‌(51 నాటౌట్‌) అర్ద సెంచరీలతో చెలరేగారు. మరో స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఇక నెదర్లాండ్స్‌ బౌలర్లలో వాన్ మీకెరెన్, క్లాసన్‌ తలా వికెట్‌ సాధించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ వికెట్ కోల్సోయి ఆరు పరుగులు చేసింది.  మ్యాచ్ ఇంకా కొనసాగుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)