IND vs AUS, 1st T20I 2022: మాథ్యూ వేడ్‌ మెరుపు ఇన్నింగ్స్‌, తొలి టీ20లో భారత్ ఓటమి, 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా

టీమిండియాతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరిలో ఆసీస్‌ ఆటగాడు మాథ్యూ వేడ్‌(20 బంతుల్లో 45 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు

India Team

టీమిండియాతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరిలో ఆసీస్‌ ఆటగాడు మాథ్యూ వేడ్‌(20 బంతుల్లో 45 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్‌ బ్యాటర్లలో గ్రీన్‌(61) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ మూడు వికెట్లు, ఉమేశ్‌యాదవ్‌ రెండు, చాహల్‌ ఒక్క వికెట్‌ సాధించాడు. ఇక అంతకుముందు హార్దిక్‌ పాండ్యా చేలరేగడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. హార్దిక్‌ కేవలం 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌(55) సూర్యకుమార్‌ యాదవ్‌( 46) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. ఇక ఆసీస్‌ బౌలర్లలో ఎల్లీస్‌ మూడు, హాజిల్‌ వుడ్‌ రెండు, గ్రీన్‌ ఒక్క వికెట్‌ సాధించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement