IND vs AUS ICC CWC 2023 Final: ప్రపంచకప్ ట్రోఫీ మీద కాళ్లు పెట్టి ఎంజాయ్ చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ
ట్రోఫీ బహూకరణ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో మార్ష్ సోఫాలో కూర్చొని ప్రపంచ కప్ ట్రోఫీపై కాళ్లు ఆనించాడు. దాంతో, అతడిపై సోషల్‌మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ(World Cup Trophy) పట్ల అవమానకరంగా ప్రవర్తించాడు. ట్రోఫీ బహూకరణ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో మార్ష్ సోఫాలో కూర్చొని ప్రపంచ కప్ ట్రోఫీపై కాళ్లు ఆనించాడు. దాంతో, అతడిపై సోషల్‌మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్ష్ నీకిది తగునా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘దయచేసి ట్రోఫీకి కాసింత మర్యాద ఇవ్వండి’, ‘ఏరకంగా చూసినా ఇది తప్పే’ అని పలువురు కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో ‘ఆస్ట్రేలియన్లకు ఇది ఏమంత సిగ్గు చేటు కాదు’ అని అంటున్నారు.
Here's Pic
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)