IND vs AUS ICC CWC 2023 Final: బెస్ట్ ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా చేతుల మీదుగా అవార్డును అందుకున్న భారత క్రికెట్ దిగ్గజం
ఈ సారి గతంలో మాదిరిగా ఎలాంటి హడావుడి లేకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఆ పేరును ప్రకటించారు.
వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన వారిని ప్రోత్సహించేందుకు బీసీసీఐ ప్రత్యేకంగా మెడల్స్‌ను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి గతంలో మాదిరిగా ఎలాంటి హడావుడి లేకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఆ పేరును ప్రకటించారు. ఓటమితో నిరాశపడిన భారత డ్రెస్సింగ్ రూమ్‌ను ఉత్సాహపరిచేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నించారు. చివరి మ్యాచ్‌లో ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డును విరాట్ కోహ్లీ అందుకున్నాడు. రవీంద్ర జడేజా చేతుల మీదుగా కోహ్లీ స్వీకరించాడు.
ఈ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మాట్లాడాడు. ‘‘భారత ఆటగాళ్లు చివరి వరకూ అద్భుతంగా పోరాడారు. అయినా ఫలితం మనకు ఆనుకూలంగా రాలేదు. రాహుల్ ద్రవిడ్ చెప్పినట్లుగా మన ఆటతీరు గర్వపడేలా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఆటగాడికి అభినందనలు చెబుతున్నా. చివరి మ్యాచ్‌లో విజేతగా నిలిచిన ఆటగాడు విరాట్ కోహ్లీ. ప్రతి మ్యాచ్‌లోనూ మైదానంలో చురుగ్గా ఉంటాడు. అతడి వల్ల సహచరుల్లోనూ ఉత్సాహం వస్తుంది. ఇలా బెస్ట్ ఫీల్డర్ అవార్డును ఇవ్వడం వల్ల డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం తీసుకురాగలిగాం’’ అని తెలిపాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)