Jadeja Dismissed Smith Video: వీడియో ఇదిగో, రవీంద్ర జడేజా అద్భుతమైన బంతికి షాక్ తిన్న స్టీవ్ స్మిత్, ఒక్కసారిగా టర్న్ అయి వికెట్లను గిరాటేసిన ఆఫ్‌సైడ్ పడిన బంతి
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. క్రీజులో పాతుకుపోవడానికి ప్రయత్నిస్తున్న స్మిత్‌ను అద్భుతమైన బంతితో స్మిత్ బోల్తా కొట్టించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 42 ఓవర్‌లో జడేజా వేసిన ఆఖరి బంతికి స్మిత్ ఢిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే ఆఫ్‌సైడ్ పడిన బంతి ఒక్కసారిగా టర్న్ అయ్యి స్మిత్ బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి స్టంప్స్‌ను గిరాటేసింది.దీంతో స్మిత్ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు.ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్ జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లు వేసిన జడ్డూ 47 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు.ఇక భారత స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్ 37, అలెక్స్ కేరీ 36 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా ఐదు వికెట్లతో కంగరూల పతనాన్ని శాసించగా.. అశ్విన్ మూడు వికెట్లతో రాణించాడు. సిరాజ్, షమీ చెరొక వికెట్ తీశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)