Mohammed Siraj Catch Video: మహ్మద్ సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, వెనక్కి డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో అద్భుతమైన రీతిలో క్యాచ్
వెస్టిండీస్ తో బుధవారం మొదలైన తొలి టెస్టులో భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో కరీబియన్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతను ఐదు వికెట్లతో చెలరేగడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది.
వెస్టిండీస్ తో బుధవారం మొదలైన తొలి టెస్టులో భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో కరీబియన్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతను ఐదు వికెట్లతో చెలరేగడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఒకే వికెట్ తీసినా తన సూపర్ ఫీల్డింగ్ తో అతను వార్తల్లో నిలిచాడు.
సూపర్ మ్యాన్ ను తలపించిన ఫీల్డింగ్ తో అతను ఓ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. 28వ ఓవర్‌లో జడేజా వేసిన బంతిని జెర్మైన్ బ్లాక్‌వుడ్ మిడాఫ్ దిశగా గాల్లోకి లేపాడు. దూరం నుంచి పరుగెత్తుకు వచ్చిన సిరాజ్ గాల్లోకి అమాంతం ఎగిరి సింగిల్ హ్యాండ్‌తో అద్భుతమైన రీతిలో క్యాచ్ పట్టాడు. బంతిని అందుకున్న తర్వాత బ్యాలెన్స్ కోల్పోయిన అతను కింద పడగా.. మోచేతికి చిన్న గాయం కూడా అయింది.ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)