Asia Cup 2023: సూపర్-4 బెర్తు ఖాయం చేసుకున్న భారత్, 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసిన టీమిండియా, వికెట్ పడకుండానే ఘన విజయం
ఆసియా కప్ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ షేక్ (97 బంతుల్లో 58; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు.
ఆసియా కప్ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ షేక్ (97 బంతుల్లో 58; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు.
అనంతరం వాన కారణంగా భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. 145 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగి టీం ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయం సాధించారు. ఆసియా కప్ లో నేపాల్ -భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మరో 17 బంతులు మిగిలి ఉండగానే.. శుభ్ మన్ గిల్ ఫోర్ కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రోహిత్ శర్మ (59 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (62 బంతుల్లో 67 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కలిసి అజేయంగా జట్టును గెలిపించారు. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
గ్రూప్-ఎ నుంచి ఇప్పటికే పాక్ సూపర్-4 చేరగా.. భారత్ రెండో బెర్తును సొంతం చేసుకుంది. నేపాల్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మంగళవారం శ్రీలంక-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌ను బట్టి గ్రూప్-బిలో సూపర్-4 బెర్తులు ఖరారవుతాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)