Ashwin 100 Wickets Video: ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు, వీడియో ఇదిగో..
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్‌లో చేరిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. రాంచి మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు.టెస్టు ఫార్మాట్లో ఒకే ప్రత్యర్థిపై 1000 పరుగులు చేయడం సహా 100 వికెట్లు తీసిన క్రికెటర్‌గా 37 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ చరిత్ర సృష్టించాడు
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్‌లో చేరిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. రాంచి మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు.టెస్టు ఫార్మాట్లో ఒకే ప్రత్యర్థిపై 1000 పరుగులు చేయడం సహా 100 వికెట్లు తీసిన క్రికెటర్‌గా 37 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుకెక్కాడు.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా జానీ బెయిర్‌స్టోను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు.
అశ్విన్ కంటే ముందు జార్జ్ జిఫెన్(ఇంగ్లండ్ మీద), మోనీ నోబుల్(ఇంగ్లండ్ మీద), విల్ఫ్రెడ్ రోడ్స్(ఆస్ట్రేలియా మీద), గ్యారీఫీల్డ్ సోబర్స్(ఇంగ్లండ్ మీద), ఇయాన్ బోతం(ఆస్ట్రేలియా మీద), స్టువర్ట్ బ్రాడ్(ఆస్ట్రేలియా మీద) టెస్టుల్లో ఈ ఫీట్ నమోదు చేశారు. వీడియో ఇదిగో, జానీ బెయిర్ స్టోని వెనక్కి పంపిన అశ్విన్, ఇంగ్లండ్‌పై 100 టెస్టు వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)