Bairstow's Dismissal Video: వీడియో ఇదిగో, జానీ బెయిర్ స్టోని వెనక్కి పంపిన అశ్విన్, ఇంగ్లండ్‌పై 100 టెస్టు వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు
ల్యాండ్‌మార్క్ వికెట్ జానీ బెయిర్‌స్టో ఔట్ రూపంలో వచ్చి, ఈ సందర్భానికి మరింత ప్రాముఖ్యతనిచ్చింది.
టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసి బెయిర్ స్టో ఔటయ్యాడు.ఇంగ్లండ్ 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెటరన్ స్పిన్నర్ అశ్విన్ రంగంలోకి దించాడు. 20 ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన బెయిర్ స్టో..ఆ తర్వాత 22 ఓవర్లో తొలి బంతినే బౌండరీగా మలిచాడు.
రెండో బంతిని సైతం ఫోర్ కొట్టడానికి ప్రయత్నించాడు. అశ్విన్ వేసిన క్యారమ్ బాల్‌కు రివర్స్ స్వీప్ ఆడటానికి బెయిర్ స్టో ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు వికెట్ కీపర్ ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు. వెంటనే రోహిత్ శర్మ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. రీప్లేలో బంతికి మిడిల్ స్టంప్‌ను హిట్ చేస్తున్నట్లు తేలింది. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఔట్‌గా ప్రకటించాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌పై 100 టెస్టు వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)